ముస్లిం మతప్రబోధకుడికి 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించిన ఇస్తాంబుల్ కోర్టు

  • టీవీ షోలలో మతపరమైన చర్చలు నిర్వహించే అద్నాన్
  • గత ఏడాది 1,075 ఏళ్ల శిక్షను విధించిన కింది కోర్టు
  • ఇప్పుడు 8,658 ఏళ్ల శిక్షను ఖరారు చేసిన ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు
ముస్లిం మత ప్రబోధకుడు అద్నాన్ అక్తర్ కు టర్కీలోని ఇస్తాంబుల్ కోర్టు ఏకంగా 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 66 ఏళ్ల అద్నాన్ అక్తర్ టీవీ షోలలో భారీ మేకప్, పొట్టి దుస్తులు ధరించిన మహిళల మధ్య కూర్చొని చర్చలు నిర్వహించేవాడు. 

మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, మిలిటరీపై గూఢచర్యం తదితర కేసుల్లో ఆయనకు గత ఏడాదే కోర్టు 1,075 ఏళ్ల శిక్షను విధించింది. అయితే పైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు ఈ కేసును విచారించింది (రీట్రయల్). ఆయనతో పాటు ఆయన అనుచరులు మరో 10 మందికి 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఈయనను అరెస్ట్ చేశారు.


More Telugu News