కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రమంతటా పత్తి రైతులది ఇదే పరిస్థితి: చంద్రబాబు
- కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- పాణ్యం నియోజకవర్గంలో పత్తి పంట పరిశీలన
- రైతులతో మాట్లాడిన వైనం
- నకిలీ విత్తన సరఫరాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కల్లూరు మండంలంలో పత్తి పంట పరిస్థితిని పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు.
కర్నూలు జిల్యాల పాణ్యం నియోజకవర్గంలోని మార్కాపురం గ్రామంలో నకిలీ విత్తనాల కారణంగా దిగుబడిని కోల్పోయిన పత్తిపంటను పరిశీలించానని వెల్లడించారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ప్రజాప్రతినిధులు కూడా కంపెనీల వారితో కుమ్మక్కై తమను దగా చేశారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు వివరించారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు... రాష్ట్రమంతటా పత్తి రైతులది ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. ఎకరాకు రూ.35 వేలకు పైనే పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం కష్టం అంటున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో, నకిలీ విత్తనాల సరఫరాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.