క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు
- క్యాసినో కేసు విచారణలో ఈడీ దూకుడు
- తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ అధికారులు
- ఎల్.రమణ సహా మెదక్ డీసీసీబీ చైర్మన్ కు నోటీసులు
- రేపు, ఎల్లుండి విచారణకు రావాలంటూ సమన్లు
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని భావిస్తున్న క్యాసినో కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ఓ కీలక అడుగు వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సీనియర్ రాజకీయవేత్త ఎల్.రమణకు నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఎల్ రమణకు ఈడీ అధికారులు సూచించారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే... ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను పలుమార్లు ప్రశ్నించిన ఈడీ ఆధికారులు, నేడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లపైనా విచారణ చేపట్టారు. మనీలాండరింగ్ వ్యవహారంలో వీరిని ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు.