లాభాల్లో ముగిసిన మార్కెట్లు... 62 వేలకు చేరువలో సెన్సెక్స్!
- 108 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 6 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.73 శాతం పెరిగిన కొటక్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. పోలండ్ భూభాగంపై క్షిపణి పడిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలో మన మార్కెట్లు కూడా ఉదయం నష్టాలతోనే ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఆ తర్వాత కూడా ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. చివరకు లాభాల్లో ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 108 పాయింట్లు లాభపడి 61,980కి చేరుకుంది. 62 వేలకు చేరువయింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18,410 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ బ్యాంక్ (2.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.98%), డాక్టర్ రెడ్డీస్ (0.92%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.80%), భారతి ఎయిర్ టెల్ (0.77%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.89%), టాటా స్టీల్ (-1.80%), ఎన్టీపీసీ (-1.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.73%).