జీ20 బాస్ గా భారత్... బాధ్యతలు అందుకున్న మోదీ

  • డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతల్లోకి భారత్
  • ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి బాధ్యతలు స్వీకరించిన మోదీ
  • ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా అభివర్ణించిన మోదీ
జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ కు దఖలు పడ్డాయి. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను నరేంద్ర మోదీ స్వీకరించారు. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

బాలిలో జరుగుతున్న జీ20  సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోదీ చెప్పుకొచ్చారు.


More Telugu News