హీరోగా 22 ఏళ్లను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్!
- బాలనటుడిగా పరిచయమైన ఎన్టీఆర్
- 'నిన్ను చూడాలని'తో హీరోగా ఎంట్రీ
- 'ఆర్ ఆర్ ఆర్'తో పతాకస్థాయికి చేరుకున్న క్రేజ్
- త్వరలో కొరటాల ప్రాజెక్టుతో సెట్స్ పైకి
ఎన్టీఆర్ బాలనటుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. 'నిన్ను చూడాలని' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యాడు. రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకి వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. రవీనా రాజ్ పుత్ కథానాయికగా అలరించిన ఈ సినిమాకి, ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయి ఆదరణ పొందలేదు.
అలా ఈ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల కోసం ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఆయన చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని కొమరం భీమ్ స్టిల్ ను ఈ పోస్టర్ లో ఆవిష్కరించడం విశేషం. 'నిన్ను చూడాలని' నుంచి 'ఆర్ ఆర్ ఆర్' వరకూ ఆయన ఎదిగిన తీరుకు ఈ పోస్టర్ అద్దం పడుతోంది.
ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాలతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా రష్మిక అలరించనుంది. ఇక ఆ తరువాత సినిమాను ఆయన ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.