బర్త్ డే నాడు కుమార్తెకు లిప్ కిస్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్... నెట్టింట ట్రోలింగ్ షురూ

  • అభిషేక్, ఐశ్వర్యల కూతురు ఆరాధ్య
  • నేడు ఆరాధ్య పుట్టిన రోజు
  • బర్త్ డే విషెస్ చెబుతూ కూతురికి లిప్ కిస్ ఇచ్చిన ఐశ్వర్య
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో
వివాదాలకు ఆమడ దూరంలో ఉండే బాలీవుడ్ నటి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్ తో సతమతమవుతున్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోనే అందుకు కారణంగా నిలవడం గమనార్హం. 

ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతులకు కూతురు ఆరాధ్య ఏకైక సంతానం. ఆరాధ్య బర్త్ డే నేడు. ఈ సందర్భంగా కుమార్తెకు బర్త్ డే విషెస్ చెబుతూ... కూతురికి ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటోను ఐశ్వర్య షేర్ చేసింది.

ఈ ఫొటోలో కుమార్తె బుగ్గ మీదో, నుదురు మీదో కాకుండా... పెదవులపైన ఐశ్వర్య కిస్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోను ఐశ్వర్య షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

మేడం మీరు కూడా ఇలా చేస్తారా? అంటూ చాలా మంది నెటిజన్లు ఐశ్వర్యను ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కుమార్తె పెదవులపై ముద్దు పెట్టడం వింతగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరైతే... ఐశ్వర్యను వెనకేసుకువస్తూ... ఈ ఫొటోలో తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. తల్లీకూతుర్ల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటూ వారు ఐశ్వర్యకు మద్దతుగా నిలుస్తున్నారు.


More Telugu News