మడ అడవుల్లో జీ20 దేశాధినేతలు... వీడియో ఇదిగో!

  • బాలిలో 13 వందల ఎకరాల్లో మడ అడవులు
  • ఇండోనేషియా ప్రభుత్వమే పెంచుతున్న వైనం
  • ఆ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతల పర్యటన
  • సెంటరాఫ్ అట్రాక్షన్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ
జీ20 సదస్సు కోసం భారత్, అమెరికా సహా పలు దేశాల అధినేతలు ప్రస్తుతం ఇండోనేషియాలో వాలిపోయారు. సోమవారం రాత్రికే బాలి చేరుకున్న ఆయా దేశాధినేతలు... మంగళవారం తొలి రోజు సమావేశాల్లో మునిగిపోయారు. అంతుకుముందు కుశల ప్రశ్నలతో ఒకరినొకరు పలకరించుకున్న దేశాధినేతలు ఫొటోలకు ఫోజులిచ్చారు. తాజాగా సదస్సుకు హాజరైన దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియాలోని అతి పెద్ద మడ అడవులను సందర్శించారు.

ఇండోనేషియాలోని బాలిలో ఆ దేశ ప్రభుత్వం 13 వందల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ అడవులను సందర్శించేందుకు జీ20 దేశాల అధినేతలు తరలి వెళ్లారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లతో పాటు సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ సాదాసీదాగా రాగా.... మోదీ ఒక్కరు మాత్రమే తన అధికారిక సూట్ లో ఈ పర్యటనలో పాల్గొనడం గమనార్హం. ఫలితంగా ఈ పర్యటనలో మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా జీ20 దేశాల అధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.


More Telugu News