సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ... ఇంటి వద్దే విచారణ చేయాలని కోర్టు ఆదేశం
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారంటూ నారాయణపై సీఐడీ కేసు
- విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ
- హైకోర్టులో సవాల్ చేసిన టీడీపీ సీనియర్ నేత
- శస్త్ర చికిత్స, వయసును దృష్టిలో పెట్టుకుని కోర్టు కీలక ఆదేశాలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.
నారాయణ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... నారాయణను విచారించడానికి సీఐడీ అధికారులకు అనుమతి ఇస్తూనే... సీఐడీకి పలు షరతులు విధించింది.
సీఐడీ కార్యాలయంలో కాకుండా హైదరాబాద్ లోని నారాయణ ఇంటి వద్దే ఆయనను విచారించాలని హైకోర్టు సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే నారాయణ శస్త్ర చికిత్స చేయించుకున్నారని, అంతేకాకుండా, వయసు రీత్యా ఆయన హైదరాబాద్ లోని తన నివాసం నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావడం ఇబ్బందిగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకుని నారాయణను హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దనే విచారించాలని కోర్టు సూచించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చి తన అనుకూలురకు లబ్ధి చేకూర్చారని నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.