న్యూజిలాండ్తో సిరీస్కు ప్రాక్టీస్ ప్రారంభించిన హార్దిక్ సేన
- 18 నుంచి కివీస్ తో మూడు టీ20ల సిరీస్
- భారత జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా
- రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమీకి విశ్రాంతి
టీ20 ప్రపంచ కప్ లో నిరాశ తర్వాత తదుపరి సిరీస్ పై భారత క్రికెట్ జట్టు దృష్టి పెట్టింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ల్లో పోటీ పడనుంది.
ఈనెల 18 నుంచి జరిగే టీ20 సిరీస్ లో పాల్గొనే టీమిండియాను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సీనియర్లు విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్ తదితరులకు అవకాశం ఇచ్చారు.
ఈ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. బుధవారం ఉదయం వెల్లింగ్టన్ స్టేడియంలో జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ సెషన్ కు హాజరయ్యారు. అంతకుముందు హార్దిక్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.