టీఆర్ఎస్ సమావేశంలో జగన్ ప్రస్తావన.. వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర అన్న కేసీఆర్

  • జగన్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారన్న కేసీఆర్
  • వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని ధ్వజం
తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను వివరించే క్రమంలో కేసీఆర్... ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను కూడా ప్రస్తావించారు. 

పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వైసీపీని, జగన్ ల ప్రస్తావనను కేసీఆర్ తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ సీఎం జగన్ అనుకూలంగానే ఉంటున్నారని కేసీఆర్ అన్నారు. ఓ వైపు తమకు జగన్ అనుకూలంగా ఉన్నా ఆయన నేతృత్వంలోని వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News