గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ ?

  • వచ్చే ఏడాది మే నెలలో విడుదల
  • ధర సుమారు రూ.1.45 లక్షలు
  • రెండు రంగుల్లో లభ్యం
  • అధికారికంగా గూగుల్ నుంచి రాని ప్రకటన
గూగుల్ పిక్సల్ ఫోన్లను ఇష్టపడే వారికి త్వరలో గూగుల్ గుడ్ న్యూస్ చెప్పనుంది. పిక్సల్ ఫోల్డ్ ఫోన్ ను గూగుల్ తీసుకురానుందని తెలుస్తోంది. శామ్ సంగ్, మోటరోలా తదితర కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ చేస్తుండడం తెలిసిందే. యాపిల్ ఇంతవరకు ఈ దిశగా ప్రయత్నం చేయలేదు. కానీ, ప్రీమియం విభాగంలో గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకువస్తుందని గూగుల్ కు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని ముందుగా లీక్ చేసే జాన్ ప్రాస్సెర్ వెల్లడించారు.

గూగుల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కనుక మనం దీన్ని అంచనా లేదా ఊహాగానంగా తీసుకోవచ్చు. పిక్సల్ ఫోల్డ్ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రానుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. వచ్చే ఏడాది మే నెలలో దీన్ని గూగుల్ విడుదల చేయనుందని జాన్ ప్రాస్సెర్ అంచనా వేస్తున్నారు. దీని ధర రూ.1,799 డాలర్లు ఉండొచ్చు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.45 లక్షలు. ప్రస్తుత గూగుల్ పిక్సల్ ఫోన్లతో పోలిస్తే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది.


More Telugu News