'తేనె మనసులు' కన్నా ముందే సినిమాల్లోకి కృష్ణ ఎంట్రీ

  • చిన్న పాత్రలతో మొదలై.. 350కి పైగా చిత్రాలతో మెప్పించిన కృష్ణ 
  • 1961 లోనే సినిమాల్లోకి కృష్ణ ఎంట్రీ
  • కులగోత్రాలు సినిమాలో చిన్న పాత్ర పోషించిన సూపర్ స్టార్
  • కృష్ణ పూర్తిస్థాయి హీరోగా వచ్చిన తొలి సినిమా 'తేనె మనసులు'
సూపర్ స్టార్ కృష్ణ తొలిసినిమా అనగానే అభిమానులకు గుర్తొచ్చేది తేనె మనసులు సినిమానే. అయితే, అంతకుముందే సినిమాలలోకి కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలలో చిన్న పాత్రలను పోషించారు. 1961 లో వచ్చిన కులగోత్రాలు సినిమాలో కృష్ణ నటించారు. ఆ మరుసటి ఏడాదిలో వచ్చిన 'పదండి ముందుకు' సినిమాలోనూ, 1963లో విడుదలైన 'పరువు ప్రతిష్ఠ' సినిమాలోనూ కృష్ణ చిన్న పాత్రలలో తెరమీద కనిపించారు. ఆ తర్వాత 1965 లో కృష్ణ పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం తేనె మనసులు.. అందుకే సూపర్ స్టార్ కృష్ణ తొలిసినిమాగా తేనెమనసులు రికార్డయింది.

తేనెమనసులు సినిమాతో పాటు కృష్ణ హీరోగా ఆ తర్వాత వచ్చిన కన్నెమనసులు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో కృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా హిట్ సినిమాలను అందించారు. కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా సూపర్ స్టార్ నిలిచారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు).. ఇలా ప్రతీ రికార్డు సూపర్ స్టార్ పేరుమీదే ఉంది. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.


More Telugu News