కేకేఆర్ జట్టుకు షాక్.. స్టార్ క్రికెటర్ దూరం
- 2023 ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని ప్యాట్ కమిన్స్ నిర్ణయం
- అంతర్జాతీయంగా బిజీ షెడ్యూల్ ను ప్రస్తావించిన ఆస్ట్రేలియా కెప్టెన్
- 2023 ప్రపంచకప్ కు ముందు విశ్రాంతి కోరుకుంటున్నట్టు ప్రకటన
కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు 2023 ఐపీఎల్ కు ముందు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్ గత మూడు సీజన్ల నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో తుంటి గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు.
"వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో పాల్గొనకూడదన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాను. వచ్చే 12 నెలల పాటు టెస్ట్ లు, వన్డేలతో అంతర్జాతీయంగా బిజీ షెడ్యూల్ ఉంది. కనుక యాషెస్ సిరీస్, ప్రపంచ కప్ కు ముందు కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను’’ అంటూ ప్యాట్ కమిన్స్ ట్వీట్ చేశాడు.
‘‘అర్థం చేసుకుంటున్నందుకు కేకే రైడర్స్ కు ఎంతగానో ధన్యవాదాలు. ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన అద్భుత బృందం కేకేఆర్. వీలైనంత త్వరలోనే తిరిగి అక్కడికి చేరుకుంటానని ఆశిస్తున్నాను’’ అంటూ కమిన్స్ తెలిపాడు.