మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి
- కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోడం నమ్మశక్యంగా లేదన్న చిరంజీవి
- మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతమని కితాబు
- ఇలాంటి వ్యక్తి భారత సినీ పరిశ్రమలోనే అరుదు అని వ్యాఖ్య
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా నివాళి అర్పిస్తున్నారు.
కృష్ణ మరణం మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. 'సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు.
అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేసుకుంటున్నాను' అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా భావోద్వేగంగా స్పందించారు.