అమెజాన్ ప్రైమ్ లో టీమిండియా-న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్ లైవ్
- ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటన
- మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న భారత్
- అమెజాన్ ప్రైమ్ యాప్, వెబ్ సైట్లో లైవ్
- బుల్లితెరపై దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం
టీ20 వరల్డ్ కప్ ప్రస్థానాన్ని నిరాశాజనకంగా ముగించిన భారత జట్టు ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్ లను అమెజాన్ ప్రైమ్ యాప్ లోనూ, వెబ్ సైట్ లోనూ ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. టీవీ లైవ్ విషయానికొస్తే, భారత్ లో మ్యాచ్ లను దూరదర్శన్ చానల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
కాగా, ఈ పర్యటనలో భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, వన్డే జట్టుకు శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ పర్యటనలో టీమిండియా కోచ్ గా ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడు.
టీ20 సిరీస్ షెడ్యూల్...
నవంబరు 18- మొదటి టీ20 (వెల్లింగ్టన్)
నవంబరు 20- రెండో టీ20 (మౌంట్ మాంగనూయ్)
నవంబరు 22- మూడో టీ20 (నేపియర్)
వన్డే సిరీస్ షెడ్యూల్...
నవంబరు 25- మొదటి వన్డే (ఆక్లాండ్)
నవంబరు 27- రెండో వన్డే (హామిల్టన్)
నవంబరు 30- మూడో వన్డే (క్రైస్ట్ చర్చ్)
టీ20 సిరీస్ కు భారత జట్టు...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్.
వన్డే సిరీస్ కు భారత జట్టు...
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, దీపక్ చహర్.