ధర్నా చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు
- గొర్రెల సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోమటిరెడ్డి ధర్నా
- రెండు గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించిన కోమటిరెడ్డి
- ఉద్రిక్తత మధ్య ఆయనను తరలించిన పోలీసులు
మునుగోడులో ఉపఎన్నిక ముగిసినప్పటికీ అక్కడ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ రెండు గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తరలించారు.