విశాఖకు రాజధానిగా అన్ని అర్హతలున్నాయని మోదీ చెప్పినట్టే!: మంత్రి కొట్టు సత్యనారాయణ
- ఇటీవలే విశాఖలో పర్యటించిన మోదీ
- విశాఖపై మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
- 3 రాజధానులకు మోదీ మద్దతిచ్చినట్టా? అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధి
- ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చిన మంత్రి
ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల అర్థం ఇదేనంటూ ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యల అర్థం... విశాఖకు రాజధానిగా అన్ని అర్హతలున్నాయని చెప్పినట్లేనని కూడా ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ ప్రస్తావించారు. ''విశాఖ ఏళ్ల తరబడి చరిత్ర కలిగిన నగరం... చాలా ప్రముఖమైన నగరం... దేశానికి గర్వకారణమైన నగరాల్లో విశాఖ ఒకటి... నగర ఔన్నత్యాన్ని, సంస్కృతి, సంస్రదాయాన్ని గౌరవిస్తా.. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది'' అని మోదీ అన్నారని మంత్రి అన్నారు. దాని అర్థం మీకు ఏ రకంగా స్ఫురించిందో నాకు అర్థం కావడం లేదని మంత్రి వ్యాఖ్యానించగా.... అంటే 3 రాజధానులకు ప్రధాని మద్దతిచ్చినట్టా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వెనువెంటనే సమాధానం ఇచ్చిన మంత్రి... విశాఖకు రాజధానిగా అన్ని అర్హతలున్నాయని మోదీ చెప్పినట్లేనని వెల్లడించారు.