ధరల పెంపు వల్ల మద్యం విక్రయాలు తగ్గాయి: ఏపీ సీఎం వైఎస్ జగన్
- ఆదాయాన్నిచ్చే శాఖలపై జగన్ సమీక్ష
- బెల్టు షాపుల తొలగింపు, పర్మిట్ రూముల రద్దుతో విక్రయాలు తగ్గాయని వెల్లడి
- అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం
- పన్ను చెల్లింపును సులభతరం చేయాలని సూచించిన సీఎం
ఆదాయాన్నిచ్చే శాఖలకు చెందిన అధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మద్యం విక్రయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయని జగన్ అన్నారు. బెల్టు షాపుల తొలగింపు, పర్మిట్ రూముల రద్దుతో విక్రయాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ధరల పెంపు కూడా మద్యం విక్రయాల తరుగుదలకు ఓ కారణంగా నిలిచిందని జగన్ చెప్పారు. అక్రమ మద్యం తయారీ, విక్రయంపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు.. పన్ను ఎగవేసే సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ట్రేడ్ అడ్వైజరీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.