కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? పరీక్ష ఎప్పుడు చేయించాలి?
- మనం తీసుకునే ఆహారం కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కావచ్చు
- జన్యుపరమైన సమస్యలున్నా ఇదే పరిస్థితి
- కొన్ని రకాల వ్యాధులు, ఔషధాలతోనూ ఇంతే
- వైద్యులను సంప్రదించడమే మంచి మార్గం
మన శరీరంలో కొలెస్ట్రాల్ అన్నది సహజంగా ఉండే పదార్థం. తీసుకునే ఆహారం, జీవక్రియల ద్వారా ఇది తయారవుతుంటుంది. ప్రొటీన్లతో కలసి రక్తం ద్వారా ప్రసరిస్తుంటుంది. అందుకే లిపోప్రొటీన్ అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్డీఎల్), హై డెన్సిటీ లిపో ప్రొటీన్ (హెచ్ డీఎల్). ట్రై గ్లిజరైడ్స్ కూడా రక్తంలో ఉండే ఒక రకమైన ఫ్యాట్. ఇవి పెరిగినా గుండె జబ్బుల రిస్క్ అధికమవుతుంది. హెచ్ డీఎల్ అధికంగా ఉంటే, అధికంగా ఉన్న ఎల్డీఎల్ ను లివర్ కు పంపించేందుకు సాయపడుతుంది.
కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు
ఈ వ్యాధులున్నా కానీ..
తీవ్ర కిడ్నీ సమస్యలు, మధుమేహం, హెచ్ఐవీ/ఎయిడ్స్, హైపో థైరాయిడిజం, లూపస్ ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణమవుతాయి. కొందరి జన్యు నిర్మాణం పరంగా ఉన్న వైవిధ్యంతో, రక్తంలో అధికంగా ఉన్న ఎల్డీఎల్ ను బయటకు పంపించలేకపోవచ్చు.
వీటికి మందులు తీసుకుంటున్నా..
మొటిమలు, కేన్సర్, అధిక రక్తపోటు, ఎయిడ్స్, అసమంజసమైన హృదయ స్పందనలు, అవయవ మార్పిడికి తీసుకునే ఔషధాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ప్రమాదం
కరోనరీ ఆర్టరీల్లో పూడికలు ఏర్పడతాయి. దీనివల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ బ్రేక్ అయినప్పుడు రక్తం గడ్డ కట్టొచ్చు. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. గుండెకు రక్తం ఆగిపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇదే మాదిరి మెదడుకు రక్త ప్రసరణ తగినంత అందనప్పుడు వచ్చేదే స్ట్రోక్.
కొలెస్ట్రాల్ నివారణ మార్గాలు
ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి?
9 ఏళ్ల వయసులో మొదటిసారి, 11 ఏళ్ల వయసులో రెండోసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించాలన్నది వైద్యుల సూచన. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకో పర్యాయం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. ఇక 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వారు ఏడాదికోసారి ఈ పరీక్షకు వెళ్లాలి. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఆరు నెలలు లేదంటే ఏటా చేయించుకోవాలి.
కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు
- శాచురేటెడ్ లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యకర కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మాంసం, పాల ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.
- స్థూల కాయం కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాల్లో ఒకటి. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ/ఎత్తు, బరువు నిష్పత్తి) 30 అంతకంటే అధికంగా ఉంటే అధిక రిస్క్ గా అర్థం చేసుకోవాలి.
- వ్యాయామం లేకపోవడం కొలెస్ట్రాల్ రిస్క్ ను పెంచుతుంది. ఎందుకంటే హెచ్ డీఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ వ్యాయామంతోనే పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఉంటే రక్షణ బలంగా ఉన్నట్టు. పొగతాగడం కూడా హెచ్ డీఎల్ ను తగ్గిస్తుంది.
- ఆల్కహాల్ తాగే అలవాటుతోనూ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
- ఇక 40 ఏళ్లు దాటిన వారిలోనూ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న క్రమంలో ఎల్డీఎల్ ను తొలగించే శక్తి కాలేయానికి తగ్గుతుంటుంది.
ఈ వ్యాధులున్నా కానీ..
తీవ్ర కిడ్నీ సమస్యలు, మధుమేహం, హెచ్ఐవీ/ఎయిడ్స్, హైపో థైరాయిడిజం, లూపస్ ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణమవుతాయి. కొందరి జన్యు నిర్మాణం పరంగా ఉన్న వైవిధ్యంతో, రక్తంలో అధికంగా ఉన్న ఎల్డీఎల్ ను బయటకు పంపించలేకపోవచ్చు.
వీటికి మందులు తీసుకుంటున్నా..
మొటిమలు, కేన్సర్, అధిక రక్తపోటు, ఎయిడ్స్, అసమంజసమైన హృదయ స్పందనలు, అవయవ మార్పిడికి తీసుకునే ఔషధాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ప్రమాదం
కరోనరీ ఆర్టరీల్లో పూడికలు ఏర్పడతాయి. దీనివల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ బ్రేక్ అయినప్పుడు రక్తం గడ్డ కట్టొచ్చు. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. గుండెకు రక్తం ఆగిపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇదే మాదిరి మెదడుకు రక్త ప్రసరణ తగినంత అందనప్పుడు వచ్చేదే స్ట్రోక్.
కొలెస్ట్రాల్ నివారణ మార్గాలు
- జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి.
- తక్కువ ఉప్పు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- జంతు కొవ్వులను తగ్గించుకోవాలి.
- వ్యాయామంతో అధికంగా ఉన్న బరువు తగ్గించుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలు అయినా చేయాలి.
- పొగతాగడం మానేయాలి.
- ఆల్కహాల్ మానేయాలి.
- ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.