ఎర్రగడ్డలో అందుబాటులోకి వచ్చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
- బ్రిడ్జ్ ను ప్రారంభించిన తలసాని, మహమ్మద్ అలీ
- రూ. 5 కోట్లతో నిర్మితమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
- మొత్తం 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను నిర్మిస్తున్న ప్రభుత్వం
భాగ్యనగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పాదచారులు రోడ్డును దాటేందుకోసం నిర్మించిన ఈ బ్రిడ్జ్ ని తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇందులో మెట్లు, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వే తో పాటు భద్రత సౌకర్యాలు, మెరుగైన లైటింగ్ ఉన్నాయి.
హైదరాబాద్ లో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తయ్యాయి. వీటికి రూ. 75.65 కోట్లు ఖర్చయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 7 బ్రిడ్జిలు అందుబాటులోకి రాగా... మిగిలిన వాటి నిర్మాణం చివరి దశలో ఉంది.