పిల్లల ఆహార అలవాట్లను మార్చుతున్న టీవీ ప్రకటనలు

  • జంక్ ఫుడ్ ఎక్కువగా తినేందుకు కారణమవుతున్నట్లు అభిప్రాయం
  • 56 శాతం తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే
  • ఈ ప్రకటనలపై నిషేధం విధించేందుకు ఎక్కువ మంది మొగ్గు
ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై టీవీల్లో వస్తున్న ప్రకటనలు.. పిల్లలు మరింత జంక్ ఫుడ్ తినేందుకు కారణమవుతున్నట్టు దేశంలో 56 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ ఇందుకు సంబంధించి ఓ సర్వే నిర్వహించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలకు సంబంధించి ప్రకటనల ద్వారా పిల్లలను కంపెనీలు లక్ష్యంగా చేసుకోకుండా నిషేధం విధించాలని 92 శాతం మంది కోరుకుంటున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సర్వే ఫలితాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది.

16 ఏళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని, ఆహారోత్పత్తులపై ప్రకటలను ఇవ్వకూడదన్న విధానాన్ని అంతర్జాతీయంగా కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు పాటిస్తున్నాయి. ఇదే విధానాన్ని దేశంలోనూ అమలు చేయాలని 81 శాతం మంది కోరుకుంటున్నారు. 11 శాతం మంది 12 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించి ఈ నిషేధం అమలు కావాలన్న అభిప్రాయాన్ని వినిపించారు.


More Telugu News