మరో 5,500 మంది ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్
- ఔట్ సోర్సింగ్ విభాగంలో తాజా లేఆఫ్ లు
- అమెరికా సహా పలు దేశాల్లో ఉద్యోగుల తొలగింపు
- ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే ఉద్యోగులను ఇంటికి పంపిన వైనం
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ట్విట్టర్ ను తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే సగం మంది ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలికారు. ఇప్పుడు సంస్థ ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ తో యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము జాబ్ కోల్పోయామనే విషయం ఉద్యోగులకు అర్థమయిందట. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ లేఆఫ్ లు చోటు చేసుకున్నాయి. వీరిని తొలగించినట్టు కాంట్రాక్టర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని ట్విట్టర్ అందించిందట.