వాట్సాప్ గ్రూపులో 256 మంది మించితే ‘మ్యూట్’

  • అనవసర నోటిఫికేషన్ల బెడదకు చెక్
  • బీటా దశలో పరీక్షిస్తున్న వాట్సాప్
  • త్వరలో ప్రజలకు అందుబాటులోకి
వాట్సాప్ కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేసింది. గ్రూప్ లో సభ్యుల సంఖ్య 256కు మించితే మ్యూట్ ఆన్ అయిపోతుంది. అటువంటప్పుడు సదరు గ్రూపు నోటిఫికేషన్లు కనిపించవు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను బీటా టెస్టర్ల పరిధిలో పరీక్షిస్తోంది. అంటే త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని అర్థం చేసుకోవచ్చు.

ఇలా సభ్యుల సంఖ్య 256 దాటినప్పుడు దానంతట అదే వాట్సాప్ చాట్ నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తుంది. దీనివల్ల అదనపు నోటిఫికేషన్ల బెడద వదులుతుంది. వాట్సాప్ ఇటీవలే ఒక గ్రూపులో సభ్యుల సంఖ్యను 256 నుంచి 1,024కు పెంచడం తెలిసిందే. దీంతో చాలా మందికి ప్రశాంతత ఏర్పడనుంది. నోటిఫికేషన్లు యథావిధిగా రావాలని భావిస్తే గ్రూపు సెట్టింగ్స్ లో అన్ మ్యూట్ చేసుకోవడమే.


More Telugu News