ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన 'మసూద'
- సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన 'మసూద'
- కథానాయికగా కావ్య పరిచయం
- కీలకమైన పాత్రను పోషించిన సంగీత
- ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల
తెలుగు తెరను ఇంతకుముందు చాలానే హారర్ థ్రిల్లర్లు .. సైకాలజికల్ థ్రిల్లర్లు పలకరించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలేవీ అంతగా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. కంటెంట్ పరంగా భయపెట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ తరహా కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మాసూద' రెడీ అవుతోంది. ఈ సినిమాపై నిన్నమొన్నటి వరకూ అంతగా బజ్ ఉండేది కాదు.
కానీ రీసెంట్ గా వదిలిన ట్రైలర్ తో ఒక్కసారిగా అందరిలో ఆసక్తి పెరిగిపోయిందనే చెప్పాలి. ఒక తల్లి .. పెళ్లీడు కొచ్చిన తన కూతురు చిత్రంగా ప్రవర్తించడం చూసి షాక్ అవుతుంది. ఒక వైపున డాక్టర్లను .. మరో వైపున భూత వైద్యులను సంప్రదిస్తుంది. కానీ చివరికి తాంత్రికం వైపుకే మొగ్గు చూపుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ వలన తెలుస్తోంది.
'ఈ రోజున నువ్వు చూపించవలసిన ధైర్యం నీకు మళ్లీ ఎప్పటికీ అవసరం రాకపోవచ్చు ' అనే డైలాగ్, మున్ముందు సన్నివేశాల తీవ్రతకు అద్దం పడుతోంది. తిరువీర్ .. కావ్య కల్యాణ్ రామ్ .. సంగీత ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టేకింగ్ పరంగా ఉత్కంఠనూ పెంచుతున్న ఈ సినిమా, హిట్ కొట్టేస్తుందేమో చూడాలి.