యూఎస్ లో 'యశోద' దూకుడు .. గట్టి ఆశలే పెట్టుకున్న మేకర్స్!
- ఈ నెల 11న విడుదలైన 'యశోద'
- తొలిరోజున వచ్చిన హిట్ టాక్
- వివిధ భాషల్లో వసూళ్ల జోరు
- 100 కోట్ల మార్కును టచ్ చేస్తుందనే అంచనాలు
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద' సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తరువాత అదే జోరును కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి - హరీశ్ దర్శకత్వం వహించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా తన దూకుడు చూపిస్తోంది. యూఎస్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి. 1 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. విడుదల చేసిన అన్ని భాషల్లోనూ కలుపుకుని ఈ సినిమా 100 కోట్లను వసూలు చేయవచ్చనే ఒక అంచనాతో మేకర్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా సాధించే వసూళ్లను బట్టి సాధ్యాసాధ్యాలు తెలుస్తాయి.
ఈ కథలోని పాయింట్ అన్ని భాషల్లోని వారికి కనెక్ట్ అయ్యేది కావడం .. ఆ పాయింటును ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించడం వలన, తెలుగు .. తమిళ భాషల్లో సమంతకి మంచి క్రేజ్ ఉండటం .. హిందీ ఆడియన్స్ కి కూడా ఆమె బాగా తెలిసుండటం వసూళ్లపై మంచి ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నారు. వాళ్ల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి మరి.