సిరియా మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
- హామ్స్ ప్రావిన్సులోని షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై దాడి
- కొంత కాలంగా ఈ ఎయిర్ బేస్ ను ఉపయోగించుకుంటున్న ఇరాన్
- రెండు నెలల క్రితం సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ దాడి
సిరియాపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడికి పాల్పడింది. హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని సిరియా మిలిటరీ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని వెల్లడించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించగా... పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.
ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దాడికి దిగినట్టు సమాచారం. రన్ వేను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరిపింది. రెండు నెలల క్రితం కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. సిరియా రాజధాని డమాస్కస్ పై దాడి చేసింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా... మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.