బెన్ స్టోక్స్... నాడు విలన్... నేడు హీరో!
- మెల్బోర్న్ లో వరల్డ్ కప్ ఫైనల్
- కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్
- చివరి వరకు క్రీజులో నిలిచిన వైనం
- 52 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్
క్రికెట్లో ఒకప్పుడు విలన్ అనిపించుకున్న వారు ఒక్క మంచి ఇన్నింగ్స్ తో హీరోలైపోతుంటారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఇది సరిగ్గా వర్తిస్తుంది.
2016 వరల్డ్ కప్ లో వెస్టిండీస్, ఇంగ్లండ్ ఫైనల్లో తలపడ్డాయి. విండీస్ లక్ష్యఛేదనలో స్టోక్స్ చివరి ఓవర్ విసరగా, విండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దాంతో విండీస్ విజేతగా నిలవగా, ఇంగ్లండ్ కు దిగ్భ్రాంతికర ఓటమి ఎదురైంది. ఆ సమయంలో స్టోక్స్ కన్నీటిపర్యంతమయ్యాడు. తన కారణంగా కప్ చేజారిందన్న బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపింది.
ఇప్పుడదే స్టోక్స్ ఇంగ్లండ్ ను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలపడం విశేషం. నేడు పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.