మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి... సంతాపం ప్రకటించిన నేతలు
- బీజేపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి
- 2004లో హన్మకొండ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం
- 2009లో కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత
- అనారోగ్య కారణాలతో కన్నుమూసిన వైనం
తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మందాడి విజయం సాధించారు. ఆ తర్వాత వృద్ధాప్యంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకకాకుండా 2009 ఎన్నికలకు కాస్తంత ముందుగా టీఆర్ఎస్ ను వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దు అయిపోయింది.
బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి సత్యనారాయణ రెడ్డి... ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తరఫుననే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మందాడి సత్యనారాయణ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.