మాకు, మీకు ఉన్న తేడా అదే!... పాక్ ప్రధానికి ఘాటు కౌంటరిచ్చిన ఇర్ఫాన్ పఠాన్!

  • టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత జట్టు
  • గత వరల్డ్ కప్ లో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా
  • ఈ రెండు సందర్భాలను పోలుస్తూ పాక్ ప్రధాని ట్వీట్
  • పొరుగు వారి బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారంటూ పఠాన్ ఘాటు రిప్లై
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియాపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ట్వీట్ కు... భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రీతిలో బదులిచ్చాడు. మాకు, మీకు ఉన్న తేడా అదేనంటూ పఠాన్ ఇచ్చిన రిప్లై పాక్ ప్రధానికి గట్టిగానే తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ షరీఫ్ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ చూసిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ''భారత్ కు, పాకిస్థాన్ కు ఉన్న తేడా ఇదే. మేం మా పట్ల ఆనందంగానే ఉన్నాం. కాని మీరు పొరుగు వారి బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు'' అంటూ పఠాన్ ఘాటు రిప్లై ఇచ్చాడు.


More Telugu News