పవన్ ను నాదెండ్ల బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం: మంత్రి గుడివాడ అమర్ నాథ్

  • పవన్, నాదెండ్లలను చిలకాగోరింకలతో పోల్చిన అమర్ నాథ్
  • జనసేన రాజకీయ పార్టీ కాదని, అదో సినిమా పార్టీ అన్న మంత్రి
  • మోదీతో భేటీ తర్వాత సంతాప సభలో మాట్లాడినట్లుగా పవన్ మాట్లాడారని సెటైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి శుక్రవారమే విశాఖ చేరుకున్న పవన్... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తాజాగా శనివారం నాదెండ్లతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కలిసి పవన్ రిషికొండలో జరుగుతున్న నిర్మాణాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో పవన్, నాదెండ్ల మనోహర్ లపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎప్పటికైనా జనసేననూ, పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్ బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని అమర్ నాథ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్, నాదెండ్లలను ఆయన చిలకా గోరింకల మాదిరిగా పోల్చారు. విశాఖలో ప్రధాని సభ విజయవంతం అయ్యిందని, ఆ విషయం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చిలకాగోరింకల మాదిరిగా పవన్, నాదెండ్ల రిషికొండ పర్యటనకు వెళ్లారని ఆయన అన్నారు.  జనసేన రాజకీయ పార్టీ కాదన్న అమర్ నాథ్... అదో సినిమా పార్టీ అన్నారు. ప్రధానితో భేటీ తర్వాత పవన్ సంతాప సభలో మాట్లాడినట్లుగా ప్రసంగించారని అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. 


More Telugu News