ఇది మాకు కొత్త జీవితం: రాజీవ్ హత్య దోషి నళిని

  • 1991లో రాజీవ్ గాంధీ హత్య
  • ఆరుగురు దోషులకు స్వేచ్ఛను ప్రసాదించిన  సుప్రీంకోర్టు 
  • నేడు వేలూరు జైలు నుంచి విడుదల
  • విడుదలైన వారిలో నళిని ఒకరు
  • ఇకపై కుటుంబ జీవనం గడుపుతానని వెల్లడి
రాజీవ్ గాంధీ హత్య దోషులు ఆరుగురికి సుప్రీంకోర్టు తాజాగా స్వేచ్ఛ ప్రసాదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వారిని నేడు వేలూరు జైలు నుంచి విడుదల చేసింది. 

జైలు నుంచి విడుదలైన రాజీవ్ హత్య దోషుల్లో నళిని శ్రీహరన్ ఒకరు. 32 ఏళ్ల జైలు జీవితం నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది తనకు కొత్త జీవితం అనీ, ఇకపై భర్త, కుమార్తెతో కలిసి కుటుంబ జీవనం కొనసాగిస్తానని వెల్లడించారు. ప్రజా ఉద్యమంలోకి వెళ్లదలచుకోలేదని నళిని స్పష్టం చేశారు. 

గత 30 ఏళ్లకు పైగా తనకు మద్దతుగా నిలిచిన తమిళులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆమె వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు.


More Telugu News