మట్టి గుట్ట ఎక్కి రిషికొండ పనులను పరిశీలించిన పవన్ కల్యాణ్

  • రెండు రోజులుగా విశాఖలోనే పవన్ కల్యాణ్
  • నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జనసేనాని
  • నేడు రిషికొండ పరిశీలనకు వెళ్లిన వైనం
విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం రిషికొండను పరిశీలించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్... నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. 

ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్... కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా...వాటిని ముట్టుకోని పవన్..  ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి... బారీకేడ్ల ఆవలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.


More Telugu News