తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న 'యశోద' .. ఫస్టు డే వసూళ్లు!

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'యశోద'
  • ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగిన థ్రిల్లర్ 
  • అనూహ్యమైన మలుపులతో సాగే కథ 
  • విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ రెస్పాన్స్
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద' నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, హరి - హరీశ్ దర్శకత్వంలో రూపొందింది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజున ఈ సినిమా యూఎస్ లో 2 లక్షల డాలర్స్ మార్క్ ను టచ్ చేయడం విశేషం. 

ఇక ఫస్టు డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైన కాసేపటివరకూ ఇది సరోగసి చుట్టూ తిరిగే కథనే కదా .. కొత్తగా ఏముంటుంది? అనే అనుకోవడం జరుగుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే కథ మలుపుతీసుకుని, సరోగసి వెనుక జరిగే అసలు కథలోకి తీసుకుని వెళుతుంది. 

కథకి తగిన కథనం .. అందుకు తగిన పాత్రలు .. వాటిని డిజైన్ చేసిన తీరు .. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అన్నిటికీ మించి సమంత యాక్షన్ తెరపై నుంచి దృష్టి మరల్చనివ్వవు. సమంత ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పచ్చు. యాక్షన్ ను .. ఎమోషన్ ను రెండు భుజాలపై ఆమె మోసిన తీరే ఈ సినిమాకి ఈ స్థాయి హిట్ ను కట్టబెట్టాయనడంలో అతిశయోక్తి లేదు.


More Telugu News