యూఎస్ లో జాబ్ పోయిందా.. భారత్ కు రండి: డ్రీమ్11 పిలుపు
- గొప్ప నైపుణ్యాలున్న వారికి తమ కంపెనీలో స్థానం ఉంటుందన్న జైన్
- స్వదేశానికి వచ్చి భారత టెక్ కంపెనీలకు మద్దతుగా ఉండాలని పిలుపు
- అమెరికాలో టెక్ కంపెనీల తొలగింపులపై స్పందన
గత కొన్ని నెలలుగా అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా.. ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ 3,800 మందిని ఇంటికి పంపించేసింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కూడా 11,000 మందిని తీసేసింది. గూగుల్ కూడా ఆ మధ్య తొలగింపుల సంకేతాలను ఇచ్చింది. దీంతో హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది.
అమెరికాలో వలస నిబంధన కింద 60 రోజుల పాటు వరుసగా ఉపాధి లేకపోతే విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలి. వారు హెచ్1బీ వీసా కోల్పోతారు. ఇది పోకూడదంటే 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించాల్సిందే. ఈ పరిణామాలపై డ్రీమ్11 సీఈవో, సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ స్పందించారు. స్వదేశానికి తిరిగొచ్చి, భారత టెక్నాలజీ కంపెనీల ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘‘యూఎస్ లో 2020 మొత్తం మీద 52,000కు పైనే తొలగింపులు జరిగాయి. స్వదేశానికి వచ్చి (ముఖ్యంగా వీసా సమస్యలు ఎదుర్కొంటున్నవారు), వచ్చే దశాబ్ద కాలంలో భారత టెక్ కంపెనీల అధిక వృద్ధిలో భాగస్వాములు కావాలనే సందేశాన్ని వ్యాప్తి చేయండి’’ అని హర్ష జైన్ పేర్కొన్నారు.
యూఎస్ లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులకు తాము అండగా నిలుస్తామని జైన్ ప్రకటించారు. డ్రీమ్11 గొప్ప నైపుణ్యాలున్న వారి కోసం ఎప్పుడూ అన్వేషిస్తుంటుందని చెప్పారు. ముఖ్యంగా నాయకత్వం, డిజైన్, టెక్నాలజీలో అనుభవం ఉన్న వారికి తాము ఉపాధి కల్పిస్తామని తెలిపారు.