బన్నీ మెచ్చిన కథలో రామ్!

  • ఆ మధ్య బన్నీకి ఒక కథ చెప్పిన బోయపాటి 
  • 'పుష్ప 2' కారణంగా చేయలేకపోయిన బన్నీ 
  • రామ్ తో బోయపాటి చేసేది అదే కథ అంటూ టాక్ 
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగు
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల  
రామ్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నిజానికి 'అఖండ' తరువాత బోయపాటి సినిమా అల్లు అర్జున్ తో ఉండనుంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. అయితే 'పుష్ప' తరువాత బోయపాటితో సినిమా చేసి, ఆ తరువాత 'పుష్ప' సీక్వెల్ కి వెళ్లాలని బన్నీ అనుకున్నాడు. 

కానీ కొన్ని కారణాల వలన 'పుష్ప 2'ను గ్యాప్ లేకుండానే సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ వెయిట్ చేయాలంటే బోయపాటి చాలాకాలం పాటు వెయిట్ చేయవలసి వస్తుంది. అందువలన అదే కథతో ఆయన రామ్ తో చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇది బన్నీ మెచ్చిన కథ అనే చెప్పుకుంటున్నారు. 

 గతంలో బన్నీ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందనేది తెలిసిందే. అంతకుమించి అన్నట్టుగానే ఆ తరువాత కథను కూడా బోయపాటి రెడీ చేసి ఉంటాడు. అందువలన ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల నటిస్తోంది. ఉగాదికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News