మోదీని కలిసిన గవర్నర్, సీఎం జగన్.. కాసేపట్లో హెలికాప్టర్ లో సభాస్థలికి పయనం!

  • ఉదయం 8 గంటలకు మోదీని కలిసిన గవర్నర్, సీఎం
  • రూ. 10,742 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
  • జన సంద్రంగా మారిన మద్దిలపాలెం జంక్షన్
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో రూ. 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈ ఉదయం 8 గంటలకు ప్రధానిని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు వీరు ముగ్గురూ హెలికాప్టర్ లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 

మరోవైపు మోదీ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం 4 వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా తరలివస్తున్న జనాలతో మద్దిలపాలెం జంక్షన్ జన సంద్రంగా మారింది.


More Telugu News