'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్న 'సర్దార్'
- అక్టోబర్ 21న థియేటర్లకు వచ్చిన 'సర్దార్'
- యాక్షన్ తో కూడిన ఎమోషన్ తో ఆకట్టుకున్న సినిమా
- తండ్రీ కొడుకులుగా మెప్పించిన కార్తి
- రెండు భాషల్లోను దక్కిన విజయం
- ఈ నెల 18 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
మొదటి నుంచి కూడా కార్తి తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. అందువలన ఆయనను తెలుగు హీరోగానే ఇక్కడి వారు భావిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఇక్కడ ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. అదే విషయాన్ని 'సర్దార్' సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను థియేటర్లలో విడుదలైంది.
తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ రెండు పాత్రలకి కథానాయికలుగా రాశి ఖన్నా - రజీషా విజయన్ ఆకట్టుకున్నారు. అటు కోలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనున్నట్టుగా ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.
'సర్దార్' గా కార్తి లుక్ .. ఆ పాత్ర ఇంట్రడక్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తండ్రీ కొడుకుల పాత్రల మధ్యగల వైవిధ్యం ఈ సినిమా హిట్ కావడంలో ప్రధానమైన పాత్రను పోషించింది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. థియేటర్ల నుంచి మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.