వర్షం వల్ల ఆలస్యంగా విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ... అట్టహాసంగా బీజేపీ రోడ్ షో
- ఏపీ పర్యటనకు వచ్చిన మోదీ
- ఐఎన్ఎస్ డేగా వద్దకు చేరుకున్న ప్రధాని
- స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్
- మోదీతో భేటీకి బయల్దేరిన పవన్
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీ పర్యటనకు విచ్చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం వర్షం వల్ల మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగాకు పయనమయ్యారు. తూర్పుతీర నౌకాదళ స్థావరంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు పయనమయ్యారు. మారుతి జంక్షన్ వద్ద ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ప్రజలకు చేయి ఊపుతూ ముందుకు కదిలారు. మోదీ రోడ్ షో నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని రోడ్ షోలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు కూడా స్థానం పీఎంవో స్థానం కల్పించింది. దాంతో సోము వీర్రాజు కూడా మోదీ కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని రోడ్ షోకు విశాఖ వాసులు భారీగా తరలి వచ్చారు. మోదీ గంటన్నర ఆలస్యంగా వచ్చినా వారు ఓపిగ్గా వేచి చూశారు.
కాగా, ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం సీఎం జగన్ పోర్టు గెస్ట్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ ఆయనను మంత్రులు, పార్టీ నేతలు కలిశారు.
అటు, జనసేనాని పవన్ కల్యాణ్ హోటల్ నోవోటెల్ నుంచి ప్రధాని మోదీతో సమావేశం కోసం చోళ సూట్ కు బయల్దేరారు.