వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపై కపిల్ దేవ్ స్పందన
- వరల్డ్ కప్ సెమీస్ లో ఓడిన టీమిండియా
- తీవ్రస్థాయిలో విమర్శలు
- చోకర్స్ అని పిలిచిన కపిల్ దేవ్
- కీలక దశలో చేతులెత్తేశారని వ్యాఖ్యలు
వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా సెమీస్ లో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఇంగ్లండ్ చేతిలో ఓడిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.
టీమిండియా ఆటగాళ్లను ఇకపై 'చోకర్స్' (కీలక దశలో చేతులెత్తేసే వాళ్లు) అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు. వాళ్లను అలా పిలవడంలో తప్పులేదని, సెమీస్ వరకు దూసుకొచ్చి, సెమీస్ లో నీరుగారిపోయారని వివరించారు.
అయితే భారత ఆటగాళ్లపై అంతకుమించి తీవ్ర పదజాలం ఉపయోగించలేనని, అభిమానులు కూడా భారత జట్టుపై దూషణలకు పాల్పడరాదని కపిల్ దేవ్ సూచించారు. సెమీస్ లో టీమిండియా చెత్తగా ఆడిందని, కానీ ఒక్క మ్యాచ్ తో వారిని తీవ్రస్థాయిలో నిందించడం తగదని పేర్కొన్నారు. సెమీస్ లో పరిస్థితులను టీమిండియా కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉపయోగించుకుందని అభిప్రాయపడ్డారు.