వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూడడమే బీజేపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం: విష్ణువర్ధన్ రెడ్డి
- విశాఖ రానున్న ప్రధాని మోదీ
- స్వాగతం పలికేందుకు విశాఖ చేరుకున్న బీజేపీ నేతలు
- బీజేపీ, జనసేన పంథా ఒక్కటేనన్న విష్ణువర్ధన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానుండడం రాష్ట్ర బీజేపీ నేతలను ఉత్సాహానికి గురిచేస్తోంది. ఈ సాయంత్రం మోదీ విశాఖ చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ నాయకత్వం ఇప్పటికే విశాఖ చేరుకుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారని, ఈ భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని విష్ణు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని, తమ అభిప్రాయం కూడా అదేనని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూడడమే బీజేపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం అని ఉద్ఘాటించారు. బీజేపీ పంథా, జనసేన పంథా ఒక్కటేనని స్పష్టం చేశారు. టీడీపీని భుజాలపై మోయాల్సిన అవసరం బీజేపీకి గానీ, జనసేనకు గానీ లేదని అన్నారు.