రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవీంద్ర జడేజా సోదరి
- రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న జడేజా అర్ధాంగి రివాబా
- బీజేపీ తరఫున జామ్ నగర్ నార్త్ నుంచి పోటీ
- కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సోదరి నైనబా
- రివాబాకు అనుభవంలేదని వ్యాఖ్యలు
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా జడేజా రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబాకు బీజేపీ టికెట్ కేటాయించింది. రివాబా ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దీనిపై రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా స్పందించారు.
నైనబా జడేజా కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. తన సోదరుడి భార్యకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివాబాకు టికెట్ ఇవ్వడం బీజేపీకి బెడిసికొడుతుందని అన్నారు.
"జామ్ నగర్ లో బీజేపీ ఓ కొత్త ముఖాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుంది. ఎందుకంటే ఆ కొత్త ముఖానికి అనుభవం లేదు, రాజకీయ కార్యకలాపాలు, పార్టీ శ్రేణులపై అవగాహనలేదు" అని విమర్శించారు.
కేవలం డబ్బుతోనే ఎన్నికల్లో గెలవొచ్చన్నది ఓ భ్రమ అని నైనబా కొట్టిపారేశారు. జామ్ నగర్ నార్త్ స్థానంపై బీజేపీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే లాభిస్తుందని వ్యాఖ్యానించారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్ర జడేజా సోదరి నైనబా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ప్రకటన రాలేదు.