జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

  • తనను కలిసిన నేతలకు పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్
  • కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న పాదయాత్ర
  • ఎక్కడా విరామం లేకుండా యాత్ర కొనసాగుతుందన్న లోకేశ్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్రపై తనను కలిసిన నేతలకు లోకేశ్ స్పష్టతనిచ్చారు. 

జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని లోకేశ్ చెప్పినట్టు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ... ముఖ్యంగా యువతను ఆకట్టుకునే దిశగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ ఈ నెలాఖరు నుంచి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. పాదయాత్రకు సంబంధించి పలు టీమ్ లను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.


More Telugu News