మరో ఫార్ములా రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం
- భారత తొలి స్ట్రీట్ సర్క్యూట్ రేస్ అయిన ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి దశకు వేదిక కానున్న భాగ్యనగరం
- ఈ నెల 19, 20న ఆరంభ పోటీలు, డిసెంబర్ 10, 11న ఫైనల్స్
- ఫిబ్రవరిలో నగరంలోనే ఫార్ములా-ఈ రేసు
తెలంగాణ రాజధాని మరో ప్రతిష్ఠాత్మక ఫార్ములా రేసుకు వేదిక కానుంది. భారత్ లో మొట్టమొదటి స్ట్రీట్ సర్య్కూట్ రేస్ అయిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐఆర్‌ఎల్ తొలి ఎడిషన్ ఆరంభ, ఫైనల్ పోటీలు (ఫార్ములా 3 లెవెల్) హుస్సేన్‌సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్‌లో జరగనున్నాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో తొలి దశ పోటీలు, డిసెంబర్ 10, 11న ఫైనల్ రేసు నగరంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ప్రీ సీజన్ టెస్టు నిర్వహిస్తారు. ఇండియన్ రేసింగ్ లీగ్ మొదటి ఎడిషన్ పోటీల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సహా ఐదు నగరాల జట్లు బరిలో నిలిచాయి.
స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ పోటీలో ఉన్న ఇతర జట్లు. బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు కొండా ఆనందిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న ఆనందిత్ రెడ్డి ఇప్పటికే పలు టైటిళ్లు నెగ్గాడు. కాగా, భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతున్న ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ లో జరగనుంది. ఎలక్ట్రానిక్ కార్లు పోటీపడే ఈ రేసు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న ట్రాక్ పై నిర్వహిస్తారు.