బిగ్ బాస్ హౌస్ లో కొత్త గేమ్ .. ఫస్టు టైమ్ కోపంతో ఊగిపోయిన రోహిత్!
- 67వ రోజుకి చేరుకున్న 'బిగ్ బాస్ 6'
- నిన్న రాత్రి జరిగిన 'వస్తా నీ వెనుక గేమ్'
- ఫైమాను టార్గెట్ చేసిన రోహిత్
- అతణ్ణి లక్ష్యంగా చేసుకున్న ఆదిరెడ్డి
- రేవంత్ తో గొడవకి దిగిన రోహిత్
'బిగ్ బాస్ హౌస్'లో 67వ రోజున అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. 'పాము - నిచ్చెన' గేమ్ ను సరిగ్గా ఆడలేకపోయినందుకు రేవంత్ ఫీలయ్యాడు. తనకి కోపం ఎక్కువ అనే ముద్ర వేస్తుండటం వల్లనే వెనక్కి తగ్గాననీ, అందువల్లనే ఓడిపోవలసి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకపై తనదైన స్టయిల్లోనే ముందుకు వెళతాననీ .. బిగ్ బాస్ లో గెలిచే ఇంటికి వెళతానంటూ ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తరువాతనే కెప్టెన్సీ పోటీదారుల మధ్య ' థర్మాకోల్ బాల్స్' తో నింపిన బస్తాలకు సంబంధించి, 'వస్తా నీ వెనుక' గేమ్ మొదలైంది.
కెప్టెన్సీ పోటీదారులైన రోహిత్ .. మెరీనా .. ఆదిరెడ్డి .. ఫైమా .. శ్రీ సత్య .. కీర్తి థర్మాకోల్ బాల్స్ నింపిన బస్తాలను వీపుకు కట్టుకుని, ఒక సర్కిల్ లో ఒకరి వెనుక ఒకరు తిరుగుతూ, ఇతరుల బస్తాల్లోని థర్మాకోల్ బాల్స్ ను లాగేయాలి. చేతులతో ప్రత్యర్థిని అడ్డుకోవాలే గానీ, కాపాడుకోవడం కోసం ఎవరి బస్తాను వారు పట్టుకోకూడదు. థర్మా కోల్ బాల్స్ పడిపోతున్నా ఆపే ప్రయత్నం చేయకూడదు. ఎవరి బస్తాల్లోని థర్మా కోల్ బాల్స్ తగ్గితే వారు పక్కకి తప్పుకోవాలి. చివరి రౌండ్ వరకూ నిలబడ్డవారు గెలిచినట్టు అనేది నియమం. ఈ గేమ్ కి రేవంత్ సంచాలకుడిగా ఉన్నాడు.
పోటీదారులంతా సర్కిల్ దాటకుండా ఈ పని చేయవలసి ఉంటుంది. ఫైమాను టార్గెట్ చేసిన రోహిత్ ఆమె బస్తాను లాగడానికి ట్రై చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలోనే ఆదిరెడ్డి .. రోహిత్ బస్తాను లాగేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరి బస్తాను ఒకరు లాగడం మొదలెట్టారు. రోహిత్ తన బస్తాలోని థర్మా కోల్ బాల్స్ చాలావరకూ కోల్పోయాడు. ఆదిరెడ్డి తన బస్తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడనీ, అయినా సంచాలకుడైన రేవంత్ చూస్తూ ఊరుకున్నాడంటూ రోహిత్ కోపంతో ఊగిపోయాడు. థర్మా కోల్ బస్తాను తన్నేసి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయాడు. సర్ది చెప్పబోయిన భార్య మెరీనాను కూడా అతను విసుక్కున్నాడు. హౌస్ లో ఎప్పుడూ కూల్ గా కనిపించే రోహిత్ ఈ రేంజ్ లో మండిపడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.