తెలంగాణలో 11.36 లక్షల ఓటర్ల తొలగింపు
- కొత్తగా 3.45 లక్షల మంది ఓటర్లకు చోటు
- రాష్ట్రంలో మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు
- ఓటర్ల ముసాయిదా జాబితా-2023 విడుదల
- అభ్యంతరాలకు 15 రోజుల గడువు
తెలంగాణంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు 2023కి గాను ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 1,48.58,887 మంది పురుషులు ఉన్నారు. మరో 1,47,02,391 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరితో పాటు 1,654 థర్డ్ జండర్ ఓటర్లు కూడా ఉన్నట్టు వెల్లడించింది. సర్వీసు ఓటర్లు 15,067 మంది ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల వయసున్న యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారని వివరించింది.
ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు. పరిశీలన తర్వాత 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్టు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అదే సమయంలో 3,45,648 మంది ఓటర్లకు కొత్తగా స్థానం కల్పించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఇతర అంశాలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని వికాస్ రాజ్ సూచించారు. అదే సమయంలో ఓటర్ల జాబితా విషయంలో ప్రతి వారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు.