ఫేస్‌బుక్‌లో ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే ఊడిన ఉద్యోగం!
- మొత్తంగా 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన జుకర్‌బర్గ్
- ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే తన ప్రయాణం ముగిసిందంటూ హిమాన్షు పోస్ట్
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల నియామకాలు ఉంటే తెలియజేయాలన్న హిమాన్షు
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం కోల్పోయిన భారత్‌కు చెందిన హిమాన్షు పెట్టిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మెటాలో ఉద్యోగం రావడంతో కెనడాకు మకాం మార్చానని, అయితే చేరిన రెండు రోజులకే తన ప్రయాణం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మెటా ఉద్యోగుల తొలగింపు ప్రభావం తనపైనా పడిందన్న హిమాన్షు.. ఉద్యోగం కోల్పోవడంతో ఇబ్బంది పడుతున్న వారి గురించే తాను ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. తర్వాత ఏం చేయాలనే దానిపై నిజంగా తనకు ఎలాంటి ఐడియా లేదని కెనడాలో కానీ, ఇండియాలో కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే తనతో పంచుకోవాలని కోరుతూ లింక్డిన్‌లో పోస్టు పెట్టారు.
హిమాన్షు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అడోబ్, ఫ్లిప్‌కార్ట్, గిట్‌హబ్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ పనిచేశాడు. కాగా, ట్విట్టర్ తన వర్క్‌ఫోర్స్‌ను సగానికి తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా అలాంటి ప్రకటనే చేసింది. మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం మందిని అంటే దాదాపు 11 వేల మందిని ఇంటికి పంపుతున్నట్టు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించాడు.