టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని వ్యంగ్యం
- టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ పరాజయం
- టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్
- 152/0 వర్సెస్ 170/0 అంటూ ట్వీట్ చేసిన షెహబాజ్ షరీఫ్
- గత వరల్డ్ కప్ లో భారత్ పై 152/0 స్కోరు చేసి గెలిచిన పాక్
- నేడు భారత్ పై 170/0 రన్స్ కొట్టి నెగ్గిన ఇంగ్లండ్
టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న టీమిండియా సెమీస్ లోనే వెనుదిరిగింది. మాంచి ఊపుమీదున్న టీమిండియా... ఇంగ్లండ్ ను ఓడిస్తుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక భారత జట్టు ఉసూరుమనిపించింది.
ఇక ఈ టోర్నీ సెమీస్ లో భారత్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. "అదన్నమాట సంగతి... అయితే ఈ ఆదివారం 152/0 వర్సెస్ 170/0" అంటూ ట్వీట్ చేశారు.
170/0 అనేది ఇవాళ ఇంగ్లండ్ ఓపెనర్లు టీమిండియాపై సాధించిన స్కోరు కాగా, 152/0 అనేది గతేడాది వరల్డ్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ సాధించిన స్కోరు. అప్పుడు టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తే, ఇప్పుడదే రీతిలో ఇంగ్లండ్ ఓడించిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ట్వీట్ ద్వారా ఎత్తిపొడిచే ప్రయత్నం చేశారు.
కాగా, ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్ ను ఓడించి పాకిస్థాన్... భారత్ ను చిత్తుచేసి ఇంగ్లండ్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ నెల 13వ తేదీ ఆదివారం నాడు మెల్బోర్న్ లో టైటిల్ సమరం జరగనుంది.