ఈ రోజే మొదలైన 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్!
- బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న 'పుష్ప'
- రెగ్యులర్ షూటింగును మొదలెట్టిన 'పుష్ప 2'
- త్వరలో షూటింగుకు బన్నీ హాజరు
- అంతకుమించి అనే స్థాయికి తీసుకెళుతున్న సుక్కూ
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగు ఈ రోజున హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగులో త్వరలోనే బన్నీ పాల్గొననున్నాడని అంటున్నారు. పెద్దగా గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఫస్టు పార్టులో కనిపించిన సునీల్ .. అనసూయ పాత్రలు జనంలోకి బాగా వెళ్లాయి. ఆ పాత్రలు రెండూ కూడా మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. అలాగే ఫహాద్ ఫాజిల్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించనుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది స్టార్లను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్మికతో పాటు మరో హీరోయిన్ కి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐటమ్ సాంగ్ లో కాజల్ కనిపించనుందని అంటున్నారు. మొత్తానికైతే అంతకు మించి అనే స్థాయికి 'పుష్ప 2'ను తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు.