'యశోద' ఫారెస్ట్ సీన్ మేకింగ్ వీడియో!

  • రేపు విడుదలవుతున్న 'యశోద'
  • అంతకంతకూ పెరుగుతున్న ఉత్కంఠ 
  • వేటకుక్క బారి నుంచి యశోద తప్పించుకునే సీన్ హైలైట్ 
  • ఆ సీన్ మేకింగ్ వీడియో వదిలిన టీమ్   
సమంత టైటిల్ రోల్ ను పోషిచిన 'యశోద' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి షూటింగు జరుపుకుంటున్నప్పుడు పెద్దగా అంచనాలు లేవు. సరోగసి చుట్టూ ఈ కథ నడుస్తుందని చెప్పినప్పుడు కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది .. ట్రైలర్ తో అంచనాలు మొదలయ్యాయి. 

సమంత ఒప్పుకున్నది ఒక సాధారణమైన సినిమా కాదనే విషయం అందరికీ అర్థమైంది. సరోగసిని కొంతమంది బిజినెస్ గా మార్చుకోవడానికి ప్రయత్నించే తీరు చుట్టూ ఈ కథ నడుస్తుందనే విషయం స్పష్టమైంది. అలాంటి శక్తుల బారినుంచి యశోద తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అందరిలో ఉత్కంఠను రేకెత్తించాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అనే ఆసక్తితో చాలామంది ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఒక సీన్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను వదిలారు. శత్రువుల బారి నుంచి యశోద తప్పించుకుని ఒక అడవిలో పరిగెడుతూ ఉంటుంది. ఆమెను ఒక వేట కుక్క వేటాడటం .. భయంతో వెనక్కి తిరిగి చూస్తూనే ఆమె పెరిగెత్తే ఆ సీన్ ఎక్కువమందికి కనెక్ట్ అయింది. ఆ సీన్ ను ఎలా చిత్రీకరించారనేది ఈ వీడియోలో చూడొచ్చు.


More Telugu News